సీజన్ 1 పూర్తి, సక్సెసే స్పూర్తి

updated: March 10, 2018 17:50 IST

286 సెలబ్రెటీలు, 26 ఎపిసోడ్స్..ఏంటి సింక్ అవటం లేదు..కేవలం 26 ఎపిసోడ్స్ కు 286 సెలబ్రెటీలు ఏమిటి.. తప్పు విని ఉంటారు. 26కు 26 మంది సెలబ్రెటీలు ఉంటారు. మహా అయితే మరో ఇద్దరు ముగ్గురు ఉంటారు..అంతేకానీ .. 286 ఉండటమేంటి అని అందామనుకుంటున్నారా...అయితే మీరు మోస్ట్ సక్సెస్ ఫుల్ షో ‘టాలీవుడ్‌ స్క్వేర్స్‌’ ని సరిగ్గా ఫాలో అవటం లేదన్నమాట. ఇప్పుడు తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో సంచలనం గా మారిన ఈ షో గురించిన డిస్కషన్స్ ఇవి.  మాటీవిలో ప్రతీ శని, ఆది వారాలు రాత్రి 9:30PM to 10:30PM  వరకూ ఓ గంటసేపు రచ్చ రచ్చ చేస్తోంది. ఆ టైమ్ లో వేరే ఛానెల్ చూడటం కాదు..వేరే పనులు పెట్టుకోవటానికి కూడా జనాలు ఇష్టపడటం లేదనే విషయం మనకు టీఆర్పీలు చూస్తే స్పష్టంగా అర్దమవుతుంది. 

ఇంతకీ ఇంత అదిరిపోయే పోగ్రాం డిజైన్ చేయటం అంటే మాటలు కాదు.. ఎన్నో పరిచయాలు ఉండాలి. ఎంతో కష్టపడాలి.  అవన్నీ ఒంటి చేత్తో చేసి చూపించే సత్తా ఉన్న  ప్రముఖ సినీ  నిర్మాత శరత్ మరార్ చేస్తున్న టీవి పోగ్రామ్ ఇది. సినిమా స్టాండర్డ్స్ స్దాయిలో ఈ టీవి పోగ్రామ్ ని డిజైన్ చేసి సక్సెస్ అయ్యారు.   ఆయన VIU కంపెనీ కోసం ‘టాలీవుడ్ స్క్వేర్స్’ ఈ  గేమ్ షో ను రూపొందించారు. ఈ కార్యక్రమానికి నవదీప్ హొస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అమెరికన్‌ ఛానల్‌ CBS  హిట్‌ గేమ్‌ షో ‘హాలీవుడ్‌ స్క్వేర్స్‌’ ప్రేరణతో ఈ గేమ్‌షో డిజైన్‌ చేశారు.. ఈ గేమ్ షో లో 9మంది సినిమా సెలబ్రిటీలు పాల్గొంటారు. ఇప్పటికే సీజన్ వన్ పూర్తైంది. సీజన్ 2 తమ ఛానెల్ కు ఇవ్వమంటూ  మిగతా ఛానెల్స్ వాళ్లు  శరద్ మరార్ వెంట పడుతున్నట్లుగా టీవి మీడియాలో వార్తలు వినపడుతున్నాయి

comments